సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 26
నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ ప్రమాదాలకు దూరంగా ఉండాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. వేడుకల పేరుతో ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
శాంతిభద్రతల కోసం పోలీస్ ఏర్పాట్లు
డిసెంబర్ 31 రాత్రి నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిత్యం పెట్రోలింగ్ నిర్వహించడంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందన్నారు.
జిల్లా వ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్త్ – డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
జిల్లా వ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్త్ – డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇండ్లలోనే వేడుకలు జరుపుకోవడం ఉత్తమమని సూచించారు.ప్రమాదకరంగా, చట్ట విరుద్ధంగా వేడుకలునిర్వహించవద్దని విజ్ఞప్తి చేశారు.
పోలీసుల సూచనలు – నిబంధనలు
డిసెంబర్ 31 రాత్రి ఆర్గనైజ్డ్ కార్యక్రమాలకు పోలీస్ అనుమతి లేదు.కుటుంబ సభ్యులతో ఇండ్లలోనే వేడుకలు జరుపుకోవాలి.
పిల్లల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలి
మైనర్లకు వాహనాలు ఇవ్వరాదు.
టపాసులు, డీజేలు పూర్తిగా నిషేధం.
మద్యం మత్తులో వాహనాలు నడపడం నేరం; అధిక వేగం నివారించాలి.
రహదారులు బ్లాక్ చేసి వేడుకలు చేయరాదు.
మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తనకు పాల్పడితే కఠిన చర్యలు.ఇతరులకు ఇబ్బంది కలిగించే చర్యలు చేయరాదు.ఇళ్లు, ప్రైవేట్ ఆస్తులు, వీధిదీపాలపై రాళ్లు వేయడం, అద్దాలు పగలగొట్టడం నేరం.ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, ట్రిపుల్ రైడింగ్, సైలెన్సర్ తొలగించి వాహనాలు నడిపితే కేసులు.
నిషేధిత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయం, వినియోగంపై కఠిన చర్యలు.
మద్యం దుకాణాలు నిర్ణీత సమయానికి మూసివేయాలి; మైనర్లకు మద్యం అమ్మకూడదు.
బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు.ఏ కార్యక్రమమైనా నిర్వహించాలంటే ముందస్తుగా పోలీస్ అనుమతి తప్పనిసరి.
సైబర్ నేరాలపై హెచ్చరిక
న్యూ ఇయర్ ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని ఎస్పీ హెచ్చరించారు. ఆన్‌లైన్‌లో అపరిచితులకు వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ ఖాతా వివరాలు, పిన్ నంబర్లు ఇవ్వవద్దని సూచించారు.
అత్యవసర సేవలు
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేసిన ఎస్పీ, అత్యవసర పరిస్థితుల్లో స్థానిక పోలీసులను లేదా డయల్ 100 కు ఫోన్ చేసి పోలీస్ సేవలు వినియోగించుకోవాలని ప్రజలను కోరారు.
