Monday, March 2, 2026
Homeతాజా సమాచారంహుజూర్‌నగర్‌లో ఘనంగా క్రిస్మస్ సంబరాలు – 2025ప్రేమ విందు కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు

హుజూర్‌నగర్‌లో ఘనంగా క్రిస్మస్ సంబరాలు – 2025ప్రేమ విందు కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు

నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 23

తెలంగాణ ప్రభుత్వం, జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలో క్రిస్మస్ సంబరాలు–2025ను ఘనంగా నిర్వహించనున్నారు. క్రైస్తవ సోదర, సోదరీమణుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమం డిసెంబర్ 24 బుధవారం సాయంత్రం 5 గంటలకు కోదాడ రోడ్డులోని కౌండిన్య ఫంక్షన్ హాల్‌లో జరగనుంది.

క్రైస్తవులకు ప్రేమ విందు

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రేమ, సౌభ్రాతృత్వాన్ని చాటేలా క్రైస్తవ సోదర, సోదరీమణులకు ప్రేమ విందు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అన్ని వర్గాల మధ్య ఐక్యతను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ముఖ్య అతిథిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారీ నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమకుమార్ రెడ్డి హాజరుకానున్నారు. ఆయన పాల్గొనే నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

CCOC కమిటీ ఆధ్వర్యంలో నిర్వహణ

హుజూర్‌నగర్ CCOC కమిటీ ఆధ్వర్యంలో ఈ క్రిస్మస్ సంబరాలను నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ సూర్యాపేట పర్యవేక్షణలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments