Wednesday, January 14, 2026
Homeతాజా సమాచారంఉపకార వేతనాల కోసం ధ్రువపత్రాల జారీకి వేగం పెంచాలి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు

ఉపకార వేతనాల కోసం ధ్రువపత్రాల జారీకి వేగం పెంచాలి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు

నల్గొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,డిసెంబర్ 23

విద్యార్థులు ఉపకార వేతనాలు సకాలంలో పొందేందుకు తహసిల్దార్లు ఎలాంటి జాప్యం లేకుండా కుల, ఆదాయ ధ్రువపత్రాలను జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. అవసరమైతే ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి, పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆమె సూచించారు. ఈ మేరకు ఆర్డీఓ, డీఈఓలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

కనగల్‌లో ఆకస్మిక తనిఖీలు

మంగళవారం నల్గొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల అమలు తీరు, ప్రజలకు అందుతున్న సేవలపై సమగ్రంగా సమీక్షించారు.

ప్రి-మెట్రిక్ ఉపకార వేతనాల దరఖాస్తులపై సమీక్ష

ముందుగా ఎంపీడీవో కార్యాలయంలో ప్రి-మెట్రిక్ ఉపకార వేతనాలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులు, పెండింగ్ దరఖాస్తులు, వాటి శాతం వంటి వివరాలను ఎంపీడీవో, తహసిల్దార్లను అడిగి తెలుసుకున్నారు.ధ్రువపత్రాల జాప్యం కారణంగానే ఎక్కువ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించిన కలెక్టర్, కుల, ఆదాయ ధ్రువపత్రాల జారీకి ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి వెంటనే చర్యలు చేపట్టాలని నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి, డీఈఓ బిక్షపతిలను ఆదేశించారు.

ఇందిరమ్మ ఇళ్ల పూర్తి పనులపై దృష్టి

అనంతరం కలెక్టర్ ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు.అలాగే పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల బిల్లులను వెంటనే చెల్లించాల్సిందిగా గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్ను ఆదేశించారు.భవిత కేంద్రం పరిశీలన – విద్యార్థులకు చాక్లెట్లుజిల్లా కలెక్టర్ భవిత కేంద్రాన్ని తనిఖీ చేసి, అక్కడ జరుగుతున్న పనులు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి, వారికి చాక్లెట్లు పంపిణీ చేశారు.

ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం తనిఖీ

అనంతరం కలెక్టర్ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, అక్కడికి వచ్చే రోగుల సంఖ్య, వైద్యులు–సిబ్బంది హాజరు రిజిస్టర్లు, ఓపీ రిజిస్టర్, అందుబాటులో ఉన్న వైద్య సేవలు, పరికరాలు తదితర అంశాలపై సమగ్రంగా పరిశీలించారు.

తనిఖీల్లో పాల్గొన్న అధికారులు

ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పీడీ రాజకుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, జిల్లా టీబీ అధికారి డాక్టర్ కల్యాణ చక్రవర్తి, డీఈఓ బిక్షపతి, తహసిల్దార్ పద్మ, ఎంపీడీవో, కనగల్ సర్పంచ్ మురళీ గౌడ్ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట పాల్గొన్నారు.
జారీ చేసిన వారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments