Wednesday, January 14, 2026
Homeతాజా సమాచారండిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మోసం యత్నం 18 లక్షల రూపాయలు కాపాడిన నల్లగొండ జిల్లా...

డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ మోసం యత్నం 18 లక్షల రూపాయలు కాపాడిన నల్లగొండ జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 19

డిజిటల్ అరెస్ట్ పేరుతో రిటైర్‌డ్ టీచర్‌ను భయభ్రాంతులకు గురి చేసి రూ.18 లక్షల రూపాయలు దోచుకునేందుకు ప్రయత్నించిన సైబర్ నేరగాళ్ల పన్నాగాన్ని నల్లగొండ జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు భగ్నం చేశారు. సకాలంలో స్పందించి బాధితుడి ఖాతా నుండి డబ్బు బదిలీ కాకుండా కాపాడారు.

రిటైర్ టీచర్‌ను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు

నల్లగొండ పట్టణానికి చెందిన రిటైర్ టీచర్ పుచ్చకాయల దేవేందర్ రెడ్డి పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త సిమ్ తీసుకొని ఫోన్ కాల్ చేశారు. బెంగళూరులో అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొన్నారంటూ తప్పుడు ఆరోపణలు చేస్తూ, తక్షణమే అరెస్ట్ చేస్తామని బెదిరించారు.

అరెస్ట్ తప్పించుకోవాలంటే రూ.18 లక్షలు డిపాజిట్ చేయాలంటూ బెదిరింపు

అరెస్ట్ నుంచి తప్పించుకోవాలంటే తాము సూచించిన అకౌంట్ నెంబర్‌కు వెంటనే రూ.18 లక్షలు జమ చేయాలని డిమాండ్ చేశారు. బెదిరింపులకు భయపడ్డ బాధితుడు ప్రకాశం బజార్‌లోని ఎస్‌బీఐ బ్యాంక్‌కు వెళ్లి డబ్బు డిపాజిట్ చేయాలని మేనేజర్‌ను కోరాడు.

బ్యాంక్ మేనేజర్ అప్రమత్తతతో తప్పిన భారీ నష్టం

బాధితుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన బ్యాంక్ మేనేజర్ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఎస్‌ఐ విష్ణుకుమార్, సిబ్బంది అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు.

ఫోన్ కాల్ లిస్ట్ పరిశీలన – నేరగాళ్ల ఫోన్ స్విచ్ ఆఫ్

బాధితుడికి వచ్చిన ఫోన్ కాల్ లిస్ట్‌ను పరిశీలించిన పోలీసులు, సైబర్ నేరగాళ్లకు తిరిగి కాల్ చేసి ప్రశ్నించగా వారు తడబడుతూ వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది.

డిజిటల్ అరెస్ట్ అంటూ బెదిరింపులు ఉండవు : డీఎస్పీ లక్ష్మీనారాయణ

ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ,డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రభుత్వ అధికారులు లేదా సంస్థలు ఎవ్వరూ బెదిరింపులు చేయరని, వీడియో కాల్స్ ద్వారా అరెస్టులు జరగవని ప్రజలు గుర్తుంచుకోవాలి అని సూచించారు.

అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే ఫిర్యాదు చేయాలి

ఇలాంటి కాల్స్ వచ్చిన వెంటనే నమ్మకుండా
👉 www.cybercrime.gov.in
👉 1930 టోల్ ఫ్రీ నెంబర్
కు ఫిర్యాదు చేయాలని ఆయన తెలిపారు.

సైబర్ క్రైమ్ పోలీసులకు జిల్లా ఎస్పీ అభినందన

సకాలంలో స్పందించి రూ.18 లక్షల భారీ మోసాన్ని అడ్డుకున్న సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ, ఎస్‌ఐ విష్ణు, హెడ్ కానిస్టేబుల్ రియాజ్, కానిస్టేబుల్ మోక్షిద్‌లను జిల్లా ఎస్పీ అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments