కారం పూడి, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 1
ఒప్పిచర్లలో కొత్త సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన
ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సోమవారం ఒప్పిచర్ల గ్రామంలో దశాబ్దాలుగా మరుగున పడిన ఎస్‌పేట–ఓప్పిచర్ల రోడ్డుకు మోక్షం కల్పిస్తూ రూ. 70 లక్షల నిధులతో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి, శంకుస్థాపన చేశారు.జడ్పీ హైస్కూల్‌లో కొత్త తరగతి గదులు అనంతరం జడ్పీ హైస్కూల్‌లో రూ. 56.79 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన ఆరు తరగతి గదులను ఎమ్మెల్యే ప్రారంభించారు.
అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే వ్యాఖ్యలు
ఎమ్మెల్యే జూలకంటి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాచర్ల నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారని, దశాబ్దాలుగా నిలిపివేసిన అభివృద్ధి పనులను ప్రభుత్వ స్థాయి వద్ద ప్రారంభిస్తున్నారని తెలిపారు.విద్యావ్యవస్థకు పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నాలువిద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమగ్ర శ్రద్ధతో ప్రభుత్వ విద్యను పూర్వ వైభవానికి తీసుకువెళ్ళేందుకు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
విద్యా ప్రేరణా ఉదాహరణ
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యసిస్తున్న పావని చంద్రిక, “విద్య ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని” నిదర్శనంగా మారిందని తెలిపారు.
