నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 27
నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలో జరిగిన రెండు వివాహ మహోత్సవాలలో నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీ) యం.సి కోటిరెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
తుమ్మడంలో పోలేపల్లి బ్రహ్మయ్య – శ్రీలత వివాహానికి హాజరు
తిరుమలగిరి సాగర్ మండలం, రాజవరం గ్రామవాస్తవ్యులు పోలేపల్లి శ్రీనివాస్ కుమారుడు పోలేపల్లి బ్రహ్మయ్య – శ్రీలత వివాహ కార్యక్రమం తుమ్మడం లోని సుమంగళి ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు బీవీ రమణ రాజు, నిడమనూర్ టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తాటి సత్యపాల్, రాజవరం తాజా మాజీ సర్పంచ్ పోలేపల్లి సైదమ్మ – ఆంజనేయులు, నిడమనూరు మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ రామలింగయ్య, అడ్వకేట్ గజ్జల జనార్దన్ రెడ్డి, పుల్లం రాజు తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండలో సారిక – మహేష్ వివాహానికి శుభాకాంక్షలు
అలాగే నల్లగొండ పట్టణంలోని జూలకంటి ఇంద్రారెడ్డి ఫంక్షన్ హాల్‌లో జరిగిన నిడమనూరు మండలం, ముప్పారం గ్రామవాస్తవ్యులు భాగం స్వరాజ్యం (సోమరాజు) కుమార్తె సారిక – మహేష్ వివాహ మహోత్సవానికి కూడా ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో భాగం జగదీశ్వర్, శివ తదితరులు పాల్గొన్నారు.
