అమరావతి, నవంబర్ 24 , డైనమిక్ న్యూస్
రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల నమోదుకు కేటాయించిన గడువును మరో ఏడాది పాటు పొడిగించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుకు లేఖ రాశారు.డిసెంట్బర్ 5తో ముగియనున్న ప్రస్తుత గడువుతో రాష్ట్రానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని సీఎం లేఖలో వివరించారు. రాష్ట్రంలో 4,748 రిజిస్టర్డ్ వక్ఫ్ ఆస్తులు, సుమారు 10,000 అన్‌రిజిస్టర్డ్ ఆస్తులు ఉన్న నేపథ్యంలో ఈ ప్రక్రియ విస్తృతంగా సాగాల్సి వస్తుందని తెలిపారు. ఇప్పటివరకు 3,100 ఆస్తుల వివరాలను మాత్రమే సెంట్రల్ పోర్టల్‌లో అప్లోడ్ చేశామని, అయితే సాంకేతిక అడ్డంకులు, స్టేక్హోల్డర్లతో సమన్వయ సమస్యలు పురోగతిని దెబ్బతీస్తున్నాయని సీఎం పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో వక్ఫ్ ఆస్తుల పూర్తి నమోదు కోసం మరో ఏడాది గడువు ఇస్తే రాష్ట్రానికి సహకారం అందించినట్లవుతుందన్నారు.
