నరసరావుపేట, డైనమిక్ న్యూస్, నవంబర్ 24
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షిణ చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణా రావు అధికారులకు ఆదేశించారు.పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్సీ బి.కృష్ణా రావు పాల్గొని, ప్రజల నుండి ఫిర్యాదును స్వీకరించారు. ఈ ప్రజా సమస్యల పరిధిలో కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ ఆర్ధిక,ఆస్తి తగాదాలు, మోసం మొదలగు ఆయా సమస్తలకు సంబంధించి 111 ఫిర్యాదులు అందాయి.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని సూచించారు.హుజూర్ నగర్, సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక మహిళ రొంపిచర్ల మండలం చాకలి గుంట తండా కు చెందిన అతనిని ప్రేమించి రెండు సంవత్సరముల క్రితం కులాంతర ప్రేమ వివాహం పెద్దల సమక్షంలో పెనుగంచిప్రోలు గుడిలో వివాహం చేసుకున్నట్లు, వివాహం అనంతరం వారికి ఒక ఆడ శిశువు సంతానం కలిగినట్లు, కానీ సుమారుగా ఏడు నెలల నుండి ఫిర్యాది భర్త ఫిర్యాదిని వేధిస్తూ అనేక ఇబ్బందులకు గురిచేస్తూ అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తున్నట్లు, ఇంటికి సరిగా రాకుండా వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు,ఫిర్యాది బంగారం కూడా తీసుకుని వెళ్లి ఇష్టారాజ్యంగా చేస్తున్నట్లు,అదేమని అడిగిన ఫిర్యాది ని దిక్కున చోట చెప్పుకోమని బెదిరిస్తున్నట్లు,ఈ విషయం గురించి గతంలో పెద్ద మనుషుల సమక్షంలో చెప్పినను అతని ప్రవర్తన మార్చుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నందుకు గాను తనకు న్యాయం చేయవలసిందిగా ఎస్పీ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.
ఫిర్యాది నరసరావుపేట పట్టణంలోని కాకతీయ నగర్ లో నివాసం ఉంటున్నట్లు, ఫిర్యాది (ఎం సి ఎ)చదివి ఉద్యోగ అవకాశం పొందక వారి తల్లిదండ్రుల తో జీవనం సాగిస్తూ పొలం పనులలో వారికి సహాయంగా ఉంటున్నట్లు,ఆ సమయంలో 9007817104 నెంబర్ నుండి గుర్తు తెలియని వారు ఫోన్ చేసి మేము ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తాము, మీరు పెట్టుబడి పెడితే పెట్టిన పెట్టుబడి కి 200 రెట్లు లాభాలు పొందేలా చూస్తాము అని ఆశ పెట్టినట్లు, ఒకరోజు కాకుండా నెలలపాటు ఫోన్లు చేసేటప్పటికి ఒక రోజు వారి మాటలు నమ్మి ఫిర్యాది కి ఉన్న కుటుంబ సమస్యలు తీరుతాయి అని, మొదటగా (పిఐఎంకో)కంపెనీ అని చెప్పి అకౌంట్ తెరిపించినట్లు, ఆ అకౌంట్ కు బ్యాంకుతో అనుసంధానించినట్లు ఫిర్యాది మొదటగా 3,00,000/- రూపాయలు పెట్టుబడి పెట్టగా తక్కువ సమయంలో 1,50,000/- రూపాయలు లాభం పొందినట్లు, అప్పుడు అకౌంట్లో ఉన్న డబ్బులు ఉపసంహరణకు అవకాశం ఉండటం వలన 33,000/- రూపాయలు తీసుకోవడం జరిగినట్లు, ఆ సమయంలో ఫిర్యాది అకౌంట్లో ఉన్న డబ్బులు (పిఐఎంకో) కంపెనీ ఇచ్చిన అకౌంట్లకు బదిలీ చేయడం జరిగినట్లు, పెట్టుబడి రూపంలో (పిఐఎంకో) కి సంబంధించిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని తరచూ వాట్సాప్ చాటింగ్ ద్వారా చెప్పిన స్టాక్స్ పై పెట్టుబడి పెట్టడం జరిగినట్లు, ఆ సమయంలో ఫిర్యాది వాట్సాప్ నందు డబ్బులు రావడం కనిపించి వారి మాటలు నమ్మి ఫిర్యాది జీవనాధారమైన పొలం తాకట్టు పెట్టి 81,00,000/- రూపాయలు అంచలంచలుగా పెట్టుబడి పెట్టడం జరిగినట్లు, వారు ఇచ్చిన అకౌంట్లకు బదిలీ చేయడం జరిగినట్లు, అంతట ఫిర్యాది ఆ నగదును ఉపసంహరణకు ప్రయత్నం చేయగా ఉపసంహరణ జరగనట్లు, కంపెనీ వారిని అడుగగా వారు బదులుగా 20% కమిషన్ చార్జెస్ కడితే ఉపసంహరణ చేసుకోవడానికి కుదురుతుందని చెప్పినట్లు, అలా కొంతకాలం గడిపి చివరికి నెంబర్ బ్లాక్ చేసి గ్రూప్ నుండి డిలీట్ చేసినట్లు, కావున ఫిర్యాది కి జరిగిన మోసానికి గాను తగు న్యాయం కొరకు ఎస్పీ గారిని కలిసి ఫిర్యాదు ఇవటం జరిగింది.
రొంపిచర్ల గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తికి సంబంధించిన యూనియన్ బ్యాంక్ ఎకౌంటు నుండి గుర్తుతెలియని వారు 2,20,000/- రూపాయలు ఎవరో గుర్తు తెలియని వారి ఖాతాకు బదిలీ అయినట్లు,ఆ ఖాతా నెంబర్ ఐఎంపీఎస్ఏఆర్/531620735388,
డిఇవి 307200100016402 కు బదిలీ అయినందున ఆ అకౌంట్స్ ను గుర్తించి, నేరస్తులను గుర్తించి వారి పై చట్టపరమైన చర్యలు తీసుకొని వారి నుండి నగదు ఫిర్యాదికు ఇప్పించవలసిందిగా ఎస్పీ గారిని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి ఫిర్యాదులను రాసి పెట్టడంలో పోలీసు ఇబ్బందులు సహాయ సహకారాలు అందించారు.
