Wednesday, January 14, 2026
Homeతాజా సమాచారం‘తెలంగాణ–నార్త్ ఈస్ట్ కనెక్ట్’ రెండు రోజుల ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం

‘తెలంగాణ–నార్త్ ఈస్ట్ కనెక్ట్’ రెండు రోజుల ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభం

హైదరాబాద్, డైనమిక్ న్యూస్, నవంబర్ 21

తెలంగాణ–నార్త్ ఈస్ట్ కనెక్ట్ 2 రోజుల ఫిల్మ్ ఫెస్టివల్‌ను రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , రాష్ట్ర రోడ్లు–భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో కలిసి శుక్రవారం ప్రారంభించారు.

ఐమాక్స్‌లో మీడియా సెంటర్ ప్రారంభం–సినిమా ప్రదర్శనలు ప్రారంభం

హైదరాబాద్‌లోని ఐమాక్స్‌ థియేటర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సెంటర్‌ను గవర్నర్, మంత్రి కలిసి ప్రారంభించారు. అనంతరం ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా తొలి మూవీ స్క్రీనింగ్‌ను ప్రారంభించారు.

వివిధ రంగాల ప్రముఖుల హాజరు

ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (FDC) చైర్మన్ దిల్ రాజు, నార్త్ ఈస్ట్ రాష్ట్రాల ప్రతినిధులు, సినీ ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు.

తెలంగాణ–నార్త్ ఈస్ట్ సాంస్కృతిక అనుబంధానికి వేదిక

ఈ ఫెస్టివల్‌ ద్వారా తెలంగాణ–నార్త్ ఈస్ట్ ప్రాంతాల మధ్య సాంస్కృతిక, సినీ అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్వాహకులు తెలిపారు. రెండు రోజుల పాటు ప్రత్యేక డాక్యుమెంటరీలు, ఫీచర్‌ ఫిల్మ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments