Wednesday, January 14, 2026
Homeతాజా సమాచారంసిపిఐ శతవార్షికోత్సవ బహిరంగ సభకు లక్షలాదిగా తరలి రావాలి డిసెంబరు 26న ఖమ్మంలో జరుగనున్న చారిత్రక...

సిపిఐ శతవార్షికోత్సవ బహిరంగ సభకు లక్షలాదిగా తరలి రావాలి డిసెంబరు 26న ఖమ్మంలో జరుగనున్న చారిత్రక వేడుక రాష్ట్ర నాయకులు బొమ్మగాని ప్రభాకర్, బెజవాడ వెంకటేశ్వర్లు, ధనుంజయ నాయుడు పిలుపు

నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, నవంబర్ 21

భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపనకు వందేళ్ళు పూర్తయిన సందర్భంగా డిసెంబరు 26న ఖమ్మంలో నిర్వహించనున్న శతవార్షికోత్సవ బహిరంగ సభకు ప్రజలు లక్షలాదిగా చేరాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, సూర్యాపేట జిల్లా సిపిఐ కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు పిలుపునిచ్చారు.శుక్రవారం నాడు నేరేడుచర్లలో వివిధ మండలాల సిపిఐ కార్యదర్శులు, ప్రజా సంఘాల బాధ్యులతో సమావేశమైన వారు పార్టీ శతాబ్దపు పోరాట గాథను వివరించారు.

సమస్యలున్న ప్రతి చోట సిపిఐ – వందేళ్ల పోరాట చరిత్ర

నాయకులు మాట్లాడుతూ—సమస్య ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్లి పరిష్కారం కోసం కడవరకు పోరాడే ఒక్క పార్టీ సిపిఐ అని అన్నారు. అధికారంలోకి రాకపోయినా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో, జనజీవనంలోని ప్రతి వర్గంలో నిలిచిన ఏకైక వామపక్ష శక్తి సిపిఐ అని పేర్కొన్నారు. కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువజనులు, రైతులు, మహిళలు, బీసీలతో సహా ప్రతి వర్గం హక్కుల కోసం సిపిఐ శతాబ్దకాలంగా సాగించిన ఉద్యమాలు, త్యాగాలు, అమరవీరుల రక్తతర్ఫణం భారత రాజకీయ చరిత్రలో పార్టీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని నాయకులు గుర్తుచేశారు.

40 దేశాల ప్రతినిధుల హాజరు – దేశవ్యాప్తంగా భారీ రెస్పాన్స్

శతవార్షికోత్సవాల ముగింపు కార్యక్రమానికి ప్రపంచంలోని 40 దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానుండగా దేశం నలుమూలల నుండి లక్షలాది మంది కార్యకర్తలు పెద్ద ఎత్తున రానున్నారని తెలిపారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రతి ఇంటి నుంచి ఒకరు, ప్రతి వీధి నుంచి ఒక బండి ఖమ్మంకు బయల్దేరేలా ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

స్థానిక నాయకుల పాల్గొనడం

ఈ సమావేశంలో నేరేడుచర్ల మండల సిపిఐ కార్యదర్శి కత్తి శ్రీనివాసరెడ్డి, పాలక వీరు మండల సిపిఐ కార్యదర్శి ముళ్ల జానయ్య, మఠంపల్లి మండల సిపిఐ కార్యదర్శి అమరారపు పున్నయ్య, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిలకరాజు శ్రీను, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రెమిడాల రాజు, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు ఉప్పతల కోటమ్మ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ లక్ష్మి, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా సహాయ కార్యదర్శి కొమర్రాజు వెంకట్, బెల్లంకొండ గోవిందు గౌడ్, తిప్పన రామ్ రెడ్డి, కొండ అంజయ్య, ఎస్‌.కె. మధార్, బొల్లం అశోక్, బత్తిని శ్రీనివాస్ గౌడ్, బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments