Wednesday, January 14, 2026
Homeతాజా సమాచారంచదువుతోనే అన్ని సాధ్యం : కలెక్టర్ ఇలా త్రిపాఠి

చదువుతోనే అన్ని సాధ్యం : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 19

58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థినులకు స్పూర్తిదాయక సందేశం ఇచ్చారు. బుధవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఇందిరాగాంధీ జయంతికి నివాళులు

కార్యక్రమం ప్రారంభంలో స్వర్గీయ భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాల అర్పించారు.
ఆమె దేశాభివృద్ధికి అందించిన సేవలను స్మరించుకున్నారు.

కష్టపడి చదివితేనే ఉన్నత స్థానం : కలెక్టర్ విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ

ఇందిరాగాంధీ కఠోర శ్రమ, పట్టుదలతో ప్రధానమంత్రి స్థాయికి చేరుకున్నారని,ప్రజల సంక్షేమార్థం “గరీబీ హఠావో” వంటి పథకాలు ప్రవేశపెట్టిన దూరదృష్టి నాయకురాలని వివరించారు.విద్యార్ధినులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించిన అంశాలు చదువు ద్వారానే జీవితంలో గొప్ప విజయాలు సాధ్యమవుతాయి,చిన్నప్పుడే కష్టపడి చదివితే భవిష్యత్తు బలంగా ఉంటుంది,మనసు ఉన్నదే గొప్ప శక్తి, ఏదైనా సాధించాలనే తపన ఉంటే అవకాశాలు స్వయంగా వస్తాయి,గొప్ప ఆలోచనలు, కష్టాలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి

నల్గొండ గ్రంథాలయానికి కొత్త భవనం

ప్రస్తుత భవనం సరిపోనందున నూతన గ్రంథాలయ భవన నిర్మాణంపై ప్రణాళికలు సిద్ధమయ్యాయని కలెక్టర్ తెలిపారు.గతంలో ఉన్న టౌన్ హాల్ ప్రాంగణంలో బాలికలకు, బాలురకు వేర్వేరు ఫ్లోర్లతో నూతన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు DPR సిద్ధం అయ్యిందని వెల్లడించారు.గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు : అధ్యక్షుడు ఆఫీస్ ఖాన్,జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ ఎం. ఆఫీస్ ఖాన్ మాట్లాడుతూ:

గ్రంథాలయాలు విజ్ఞానాన్ని పంచే కేంద్రాలు

నల్గొండ గ్రంథాలయానికి ఆధునిక భవనం అవసరం ఉందని జిల్లా కలెక్టర్‌ను కొత్త భవనం ఆమోదం కోసం చర్యలు తీసుకోవాలని కోరారు.విజేతలకు బహుమతుల ప్రదానం జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు జిల్లా కలెక్టర్ బహుమతులు అందజేశారు.

కార్యక్రమంలో పాల్గొన్నవారు

జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రటరీ బాలమ్మ, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్, సిబ్బంది, విద్యార్థినులు భారీగా పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments