Wednesday, January 14, 2026
Homeక్రైమ్హోంగార్డ్ సిబ్బందికి ఆరోగ్య–ప్రమాద భీమాపై అవగాహన ప్రతి కుటుంబానికి ఆర్థిక రక్షణే లక్ష్యం

హోంగార్డ్ సిబ్బందికి ఆరోగ్య–ప్రమాద భీమాపై అవగాహన ప్రతి కుటుంబానికి ఆర్థిక రక్షణే లక్ష్యం

నల్లగొండ బ్యూరో, డైనమిక్, నవంబర్ 18

నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంకుల ఆధ్వర్యంలో హోంగార్డ్ సిబ్బందికి ఆరోగ్య భీమా మరియు ప్రమాద భీమా గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచనల మేరకు, అదనపు ఎస్పీ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.భీమా ప్రీమియంతో 33 లక్షల వరకు ఆరోగ్య రక్షణ0సంబంధిత బ్యాంకుల అధికారులు తెలిపారు.హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంకుల్లో ఖాతా ఉన్న హోంగార్డ్ సిబ్బంది సంవత్సరానికి రూ.11,650 ప్రీమియం చెల్లిస్తే,కుటుంబంలోని నలుగురికి (భార్య, ఇద్దరు పిల్లలు) రూ.33 లక్షల వరకు ఆరోగ్య భీమా వర్తిస్తుందని చెప్పారు.అలాగే, శాలరీ అకౌంట్ కలిగి ఉండి ప్రతి నెల డెబిట్ కార్డు వినియోగించే సిబ్బంది ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబ సభ్యులకు రూ.30 లక్షల వరకు ప్రమాద భీమా అందుతుందని వివరించారు.ఆరోగ్య భీమా ప్రతి ఒక్కరికీ అవసరం అదనపు ఎస్పీ అన్నారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ రమేష్ మాట్లాడుతూ—

నేటి కాలంలో ఆరోగ్య భీమా ప్రతి ఒక్కరికీ అత్యవసరమని,అనుకోని ఆరోగ్య సమస్యల సమయంలో ఈ భీమా పాలసీలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.సులభంగా లోన్ ఇస్తామని చెప్పే యాప్‌లపై జాగ్రత్తగా ఉండాలని,అలాంటి యాప్‌లలో లోన్లు తీసుకోవడం వలన అధిక వడ్డీలతో ఇబ్బందులు ఎక్కువైపోతాయని హెచ్చరించారు.ఆర్థిక భద్రత కోసం సరైన భీమా పాలసీలు ఎంచుకోవడం కుటుంబానికి ధీమా కలిగిస్తాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో లో పాల్గొన్నవారు

అడిషనల్ ఎస్పీ రమేష్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, హోంగార్డ్ ఆర్‌ఐ శ్రీను, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్ సత్యనారాయణ, యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ రవీందర్ రెడ్డి, ఇన్సూరెన్స్ అధికారులు, హోంగార్డ్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments