నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 17
నల్లగొండ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, ఐటీఐ క్యాంపస్‌లో ఈ నెల 19న మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్. పద్మ తెలిపారు.
MSN ల్యాబ్‌లలో ఉద్యోగాలు – ఇంటర్మీడియట్ MPC/BiPC/MLT అర్హులు
MSN లాబొరేటరీస్‌లో ఖాళీల భర్తీ కోసం ఇంటర్మీడియట్ (MPC/BiPC/MLT) 2024 & 2025 బ్యాచులకు చెందిన అభ్యర్థులు జాబ్ మేళలో పాల్గొనవచ్చని తెలిపారు. ఎంపికైన వారికి నల్లగొండ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉద్యోగాలు లభ్యం కానున్నాయి.
SBI, అపోలో ఫార్మసీతో పాటు ఇతర ప్రైవేట్ కంపెనీల్లో అవకాశాలు
ఉద్యోగ మేళలో SBI, అపోలో ఫార్మసీతో పాటు అనేక ప్రైవేట్ సంస్థలు కూడా పాల్గొంటున్నాయని అధికారులు వెల్లడించారు. ఉద్యోగులకు నెల జీతం రూ.10,000 నుండి రూ.25,000 వరకు ఉండనున్నట్లు తెలిపారు.
18–35 ఏళ్ల వయస్సు గల SSC నుండి గ్రాడ్యుయేట్ వరకూ అర్హులు
ఇట్టి ఉద్యోగాలకు SSC, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ చేసినవారితో పాటు D-Pharmacy, B-Pharmacy, M-Pharmacy చదివిన అభ్యర్థులు కూడా అర్హులని పేర్కొన్నారు. వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉన్నవారు హాజరు కావచ్చు.
అభ్యర్థులు ఒరిజినల్స్‌తో హాజరు కావాలి
జాబ్ మేళలో పాల్గొనదలచిన వారు తమ బయోడేటాతో పాటు ఒరిజినల్ విద్యాసర్టిఫికేట్స్ తీసుకుని 19-11-2025 ఉదయం 10.30 గంటలకు నల్లగొండ ఐటీఐ క్యాంపస్‌లోని ఉపాధి కల్పన కార్యాలయానికి హాజరుకావాలని సూచించారు.మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు: 7893420435, 7095612963
