Wednesday, January 14, 2026
Homeఆంధ్ర ప్రదేశ్పాన్–ఆధార్ లింకింగ్‌కు 2025 డిసెంబర్ 31 చివరి గడువు లింక్ చేసుకోని పాన్ కార్డులు నిలిపివేతకు...

పాన్–ఆధార్ లింకింగ్‌కు 2025 డిసెంబర్ 31 చివరి గడువు లింక్ చేసుకోని పాన్ కార్డులు నిలిపివేతకు గురయ్యే అవకాశం

న్యూ ఢిల్లీ, డైనమిక్ న్యూస్ డెస్క్,నవంబర్17

పాన్ కార్డును ఆధార్ నంబర్‌తో తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేసింది.2025 డిసెంబర్ 31 వరకు లింక్ చేయని పాన్ కార్డులు తదుపరి నుంచి నిష్క్రియంగా మారవచ్చని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది.

బ్యాంకుల్లో పెద్ద మొత్తాల లావాదేవీలకు అడ్డంకులు

లింక్ చేయని పాన్ కార్డుతో బ్యాంకులు ఇకపై పెద్ద మొత్తాల డిపాజిట్, విత్‌డ్రా‌లను స్వీకరించబోవని సమాచారం.రూ. 50,000 కంటే ఎక్కువ డిపాజిట్,పెద్ద మొత్తంలో విత్‌డ్రా చేలేరు.అధిక విలువ గల లావాదేవీలు ఇవన్నీ లింక్ చేసిన పాన్ కార్డుతోనే సాధ్యమని బ్యాంకింగ్ వర్గాలు తెలియజేశాయి.

పన్ను సంబంధిత సేవలు నిలిచే ప్రమాదం

పాన్ నిష్క్రియం అయితే ,ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు,టీసీఎస్/టిడిఎస్ లావాదేవీలు,ఆస్తి కొనుగోలు–అమ్మకాల రికార్డులు,బ్యాంక్, పోస్ట్ఆఫీస్, మ్యూచువల్ ఫండ్ కార్యకలాపాలు
మొత్తం ఆగిపోతాయని అధికారులు హెచ్చరించారు.

వెంటనే లింక్ చేసుకోవాలని సూచన

ఇప్పటికీ పాన్–ఆధార్ లింకింగ్ పూర్తి చేయని వారంతా గడువు ముగియకముందే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఐటీ శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ–ఫైలింగ్ పోర్టల్, ఆధార్ సేవా కేంద్రాలలో లింకింగ్ సులభంగా అందుబాటులో ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments