ఎపి, డైనమిక్ డెస్క్,నవంబర్11
ప్రకాశం జిల్లా పెదఈర్లపాడు లో సీఎం చంద్రబాబు నేడు మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (MSME) పార్క్‌ను ప్రారంభించనున్నారు. ఈ పార్క్ ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం లభించనున్నది.
గంగపాలెం ఇండస్ట్రియల్ పార్క్‌కు వర్చువల్ ప్రారంభం
అలాగే గంగపాలెం ప్రాంతంలో నిర్మాణం పూర్తయిన ఇండస్ట్రియల్ పార్క్‌ను సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ పార్క్ ద్వారా జిల్లాలో పారిశ్రామిక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
పారిశ్రామిక వృద్ధికి ప్రాధాన్యత
రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం సృష్టించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని అధికారులు తెలిపారు. కొత్త పార్క్‌లతో పెట్టుబడులు పెరిగి, ఉపాధి అవకాశాలు విస్తరించనున్నాయని అధికారులు పేర్కొన్నారు.
