హైదరాబాద్, డైనమిక్ డెస్క్,నవంబర్3
చేవెళ్లలో చోటుచేసుకున్న భయంకర రోడ్డు ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి తక్షణం ఉత్తమ వైద్య సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.అలాగే, మృతుల కుటుంబాలను ఆర్థికపరంగా ఆదుకోవాలని కేసీఆర్ సూచించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి కారణాలను వెలికితీయాలని ఆయన డిమాండ్ చేశారు.ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తగిన సాయం అందించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
