లండన్,డైనమిక్ డెస్క్,నవంబర్2
వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఆయన సతీమణి శ్రీమతి భువనేశ్వరికు అక్కడి తెలుగు కుటుంబాలు ఘన స్వాగతం పలికాయి.ఈ నెల 4వ తేదీన ప్రతిష్ఠాత్మక సంస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమంలో శ్రీమతి భువనేశ్వరి రెండు అవార్డులు అందుకోనున్నారు.ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా ప్రజాసేవ, సామాజిక ప్రభావంలో ఆమె చేసిన సేవలను గుర్తించి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డు ప్రదానం చేయనున్నారు. అదేవిధంగా, హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వీసీఎండీ హోదాలో ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో సంస్థకు గోల్డెన్ పీకాక్ అవార్డు లభిస్తోంది.ఈ రెండు పురస్కారాలను స్వీకరించబోతున్న భువనేశ్వరి సత్కార కార్యక్రమంలో పాల్గొనడానికి చంద్రబాబు నాయుడు ఎంతో ఆనందంగా ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.
