Wednesday, January 14, 2026
Homeఅంతర్జాతీయంఎగిరే కారు తెస్తున్న ఎలాన్ మస్క్— టెక్ ప్రపంచంలో కొత్త సంచలనం అసాధ్యాలను సాధ్యం చేసే...

ఎగిరే కారు తెస్తున్న ఎలాన్ మస్క్— టెక్ ప్రపంచంలో కొత్త సంచలనం అసాధ్యాలను సాధ్యం చేసే మస్క్

డైనమిక్ డెస్క్, డిల్లీ,నవంబర్2

ఎప్పటికప్పుడు వినూత్న ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, మరో సంచలన ప్రకటన చేశారు. ఆయన తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, గాల్లో ఎగిరే కారును టెస్లా తయారు చేస్తోందని వెల్లడించారు.

ఈ ఏడాదిలోనే ప్రోటోటైప్ ప్రదర్శన

మస్క్ ప్రకారం, ఈ ఏడాదిలోనే ఆ ఎగిరే కారుకు సంబంధించిన ప్రోటోటైప్‌ను ప్రపంచానికి చూపించనున్నారు. ఇది టెస్లా చరిత్రలో కీలక ఘట్టంగా నిలవనుందని ఆయన పేర్కొన్నారు.

రెక్కలతోనా? లేక హెలికాప్టర్లా?

ఆ కారు ఎలాంటి విధానంలో ఎగురుతుందన్న అంశంపై మాత్రం మస్క్ వివరాలు వెల్లడించలేదు. “ఆ కారు రెక్కల సాయంతోనా, లేక హెలికాప్టర్‌ల్లా ఎగురుతుందా?” అన్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఆసక్తిని మరింత పెంచారు.

ఊహలకు అందని ఆవిష్కరణ

“మేము రూపొందిస్తున్న ఈ ఎగిరే కారు, ఊహలకు అందని విధంగా విప్లవాత్మకంగా ఉంటుంది,” అని మస్క్ తెలిపారు. ఆయన ఈ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా టెక్ అభిమానులు, ఆటోమొబైల్ పరిశ్రమలోని కంపెనీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

టెస్లా నుంచి మరో అద్భుతం?

ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన టెస్లా, ఈ సారి ఎగిరే కారుతో కొత్త యుగాన్ని ప్రారంభించనుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments