Thursday, January 15, 2026
Homeఅనంతపురం జిల్లాకంది, మొక్కజొన్న పంటలను పరిశీలించి రైతులతో క్షేత్ర స్థాయిలో ముచ్చటించిన  రాష్ట్ర మంత్రి సవిత

కంది, మొక్కజొన్న పంటలను పరిశీలించి రైతులతో క్షేత్ర స్థాయిలో ముచ్చటించిన  రాష్ట్ర మంత్రి సవిత

అనంతపురం , డైనమిక్ డెస్క్,నవంబర్1

అనంతపురం జిల్లా రొద్దం మండలంలో శనివారం  పంటల పరిస్థితిని రాష్ట్ర మంత్రి సవిత పరిశీలించారు. నాగిరెడ్డిపల్లి నుంచి పెనుకొండ వెళ్తున్న సమయంలో దారిలో ఉన్న కుర్లపల్లి గ్రామానికి చెందిన రైతు వీరచిన్నప్ప పొలంలోని మొక్కజొన్న పంటను, రొద్దం మండలానికి చెందిన రైతు సిద్దన్న వేసిన కంది పంటను మంత్రి స్వయంగా పరిశీలించారు.పంటల దిగుబడి, పెట్టుబడి ఖర్చులు, వర్షపాతం ప్రభావం వంటి అంశాలను మంత్రి సవితమ్మ రైతులతో చర్చించారు. రైతులు తమ పంటల పరిస్థితిపై మంత్రి ప్రత్యక్షంగా విచారించడంపై ఆనందం వ్యక్తం చేశారు.“ఇంతవరకు ఎవరూ ఇలా వచ్చి పంటలు చూసి మన బాగోగులు అడిగిన దాఖలాలు లేవు” అని రైతులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments