Wednesday, January 14, 2026
Homeఅమరావతి393 అంబాసిడర్‌తో అనుబంధాన్ని స్మరించిన సీఎం చంద్రబాబు

393 అంబాసిడర్‌తో అనుబంధాన్ని స్మరించిన సీఎం చంద్రబాబు

డైనమిక్ డెస్క్,అమరావతి, నవంబర్ 1

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవన ప్రయాణంలో ప్రత్యేక గుర్తింపును సంతరించుకున్న 393 అంబాసిడర్ కారుతో మళ్లీ జ్ఞాపకాలను తడుముకున్నారు. మూడు దశాబ్దాల క్రితం ఆయన ఉపయోగించిన ఈ అంబాసిడర్ కారు తన వ్యక్తిగత వాహనం.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రవ్యాప్తంగా అధికారిక పర్యటనలకు వెళ్లినప్పుడు ఈ కారు ఆయన కాన్వాయిలో ప్రధాన ఆకర్షణగా ఉండేది. “393 అంబాసిడర్ అంటేనే చంద్రబాబు” అని రాజకీయ వర్గాల్లో ప్రత్యేక గుర్తింపును పొందిన ఈ వాహనాన్ని సీఎం ఎంతో మమకారంగా చూసుకుంటారు. ప్రస్తుతం నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు భద్రతా పరమైన ఆధునిక వాహనాలను వినియోగిస్తున్నప్పటికీ, ఆ నాటి 393 అంబాసిడర్ కారు తనకు ఒక అపురూపమైన స్మారక చిహ్నమని పేర్కొన్నారు.ఇటీవ‌ల హైదరాబాదులో నిల్వ ఉంచిన ఈ కారును ఇప్పుడు అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా ఆ కారును పరిశీలించిన సీఎం, ఆ వాహనంలో చేసిన తన పాత పర్యటనలను, రాజకీయ స్మృతులను స్మరించుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments