Wednesday, January 14, 2026
Homeఅంతర్జాతీయంలండన్ పర్యటనకు సీఎం చంద్రబాబు దంపతులు

లండన్ పర్యటనకు సీఎం చంద్రబాబు దంపతులు

డైనమిక్ డెస్క్,అమరావతి, నవంబర్ 1

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భార్య భువనేశ్వరి దంపతులు ఈ రోజు లండన్ పర్యటనకు బయలు దేరనున్నారు. వ్యక్తిగత పర్యటన అనంతరం సీఎం లండన్‌లో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.ఈనెల 4న లండన్‌లో భువనేశ్వరి కి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంలో జరిగే కార్యక్రమానికి లండన్‌లోని ప్రముఖులు, ప్రవాసాంధ్రులు హాజరుకానున్నారు.లండన్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు పారిశ్రామికవేత్తలు,ప్రవాసాంధ్రులతో కూడా సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై చర్చించనున్నారు.నవంబర్ 6న సీఎం చంద్రబాబు దంపతులు లండన్ నుంచి తిరిగి అమరావతికి చేరుకోనున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments