ఏపి , డైనమిక్ డెస్క్,అక్టోబర్ 31
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) నవంబర్ మొదటి వారంలో కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. హైదరాబాద్‌లోని పీపీఏ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ సమావేశం 17వ పీపీఏ మీటింగ్ ఉండనుంది. సమావేశానికి కేంద్ర జల్‌శక్తి శాఖ ఉన్నతాధికారులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఇరిగేషన్ శాఖాధికారులు హాజరుకానున్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల ప్రస్తుత స్థితి, పీపీఏ కార్యాలయాన్ని రాజమహేంద్రవరానికి తరలించే అంశం, ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరాలు, అలాగే పోలవరం–బనకచర్ల లింక్ వంటి 14 ప్రధాన అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు.ఈ సమావేశం ద్వారా ప్రాజెక్టు పనుల వేగం, అనుబంధ రాష్ట్రాల సమన్వయం, నిధుల వినియోగం వంటి అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
