వరంగల్, అక్టోబర్ 31 (డైనమిక్ న్యూస్):
తాజా వర్షాలతో వరద ప్రభావితమైన వరంగల్ జిల్లాలో పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు జిల్లా పర్యటనలో ఉన్నారు. హుస్నాబాద్, వరంగల్ పరిధిలోని పలు ముంపు ప్రాంతాలపై సీఎం రేవంత్ ఏరియల్ సర్వే నిర్వహించారు.మధ్యాహ్నం 2 గంటలకు హనుమకొండలో సీఎం హెలికాప్టర్ ల్యాండింగ్ జరగనుంది. అనంతరం సమ్మయ్యనగర్, కాపువాడ ప్రాంతాల్లో వరద ముంపు ప్రభావాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి, ప్రజలను పరామర్శించనున్నారు.తరువాత జిల్లా కలెక్టరేట్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ముంపు బాధితులకు తక్షణ సహాయ చర్యలు, పరిహారం ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
