Wednesday, January 14, 2026
Homeజాతీయంజూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు రోజుకు రెండు డివిజన్ల చొప్పున...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు రోజుకు రెండు డివిజన్ల చొప్పున మూడు విడతలుగా ప్రచారం

డైనమిక్ డెస్క్,హైదరాబాద్‌, అక్టోబర్‌ 31

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్‌ రెడ్డి ఇవాళ్టి నుంచి శుభారంభం చేశారు. ఈ సందర్భంగా ఆయన మూడు విడతలుగా ప్రచారం నిర్వహించనున్నారు.ప్రతి రోజు రెండు డివిజన్ల చొప్పున ప్రచార కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుక్రవారం సాయంత్రం వెంగళరావు నగర్‌ డివిజన్‌లో రోడ్‌షోలో పాల్గొననున్నారు. ఈ రోడ్‌షో పి జె ఆర్ సర్కిల్‌ నుంచి ప్రారంభమై జవహర్‌నగర్‌ మీదుగా సాయిబాబా టెంపుల్‌ (చాకలి ఐలమ్మ విగ్రహం) వరకు కొనసాగుతుంది. అనంతరం సాయిబాబా టెంపుల్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో సీఎం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తర్వాత ఆయన సోమాజిగూడ డివిజన్‌లోని ఎల్లారెడ్డిగూడ మార్కెట్‌ ప్రాంతం — కృష్ణా అపార్ట్‌మెంట్స్‌ సమీపంలో మరో కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొననున్నారు. పార్టీ అభ్యర్థి విజయం కోసం ప్రజల మద్దతు కోరనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments