

నల్గొండలో వానాకాలం ధాన్యం సేకరణకు కంట్రోల్ రూమ్ ప్రారంభం
డైనమిక్,నల్గొండ బ్యూరో
కొనుగోలు కేంద్రాల్లో ముమ్మరంగా కొనుగోళ్లు
2025-26 వానాకాలం ధాన్యం సేకరణలో తలెత్తే సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు.ఫిర్యాదులు, సూచనలు తెలియజేయడానికి ఫోన్ నంబర్లు ధాన్యం సేకరణకు సంబంధించి ఏవైనా సమస్యలు, సూచనలు లేదా ఫిర్యాదులను కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 9281423653కు తెలియజేయవచ్చని కలెక్టర్ తెలిపారు.
అదనంగా, రాష్ట్రస్థాయి టోల్ ఫ్రీ నంబర్లు 1967 మరియు 18004250033 ద్వారా కూడా ఫిర్యాదులు తెలియజేయవచ్చునని వెల్లడించారు.
జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైందని కలెక్టర్ తెలిపారు.
కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్లు, రైస్ మిల్లులలో అన్లోడింగ్ సమస్యలు, ఇతర సమస్యలను సాయంత్రం 8 గంటల వరకు కంట్రోల్ రూమ్ ద్వారా పరిష్కరించవచ్చని తెలిపారు.
కంట్రోల్ రూమ్ నిర్వాహణ
కంట్రోల్ రూమ్ ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తుంది.
ఇక్కడ పౌరసరఫరాలు, సహకార, వ్యవసాయ, మార్కెటింగ్, ట్రాన్స్పోర్ట్, రెవెన్యూ, పోలీస్, డిఆర్డిఓ వంటి విభాగాల సిబ్బంది ఉంటారు.రెండు విడతల్లో సిబ్బంది ఫిర్యాదులను స్వీకరించి, రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. సమస్యలను తక్షణమే సంబంధిత అధికారులకు పంపి పరిష్కరిస్తారు.
అందుబాటులో వుండే అధికారులు
అదనపు కలెక్టర్లు నారాయణ అమిత్, జే. శ్రీనివాస్ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి పౌరసరఫరాల జిల్లా అధికారి వెంకటేష్ పౌరసరఫరాల జిల్లా మేనేజర్ గోపికృష్ణ జెడ్పీ సీఈవో శ్రీనివాసరావు ఈ విధంగా, ధాన్యం సేకరణలో సమస్యలు ఎదురైన పంటదారులు కస్టమర్ ఫ్రెండ్లీ విధానంలో సమస్యలకు తక్షణమే పరిష్కారం పొందవచ్చని కలెక్టర్ చెప్పారు.
