Wednesday, January 14, 2026
Homeక్రైమ్మెదక్ జిల్లాలో 30 మొబైల్ ఫోన్లు స్వాధీనం –పాపన్నపేట పోలీసుల విశేష కృషి: జిల్లా అదనపు...

మెదక్ జిల్లాలో 30 మొబైల్ ఫోన్లు స్వాధీనం –పాపన్నపేట పోలీసుల విశేష కృషి: జిల్లా అదనపు ఎస్పీ మహేందర్

మెదక్ జిల్లా స్టాఫర్, డైనమిక్,నవంబర్1

మెదక్ జిల్లా పాపన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గల్లంతైన 30 మొబైల్ ఫోన్లను పోలీసులు విజయవంతంగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా అదనపు పోలీసు అధికారి మహేందర్, పాపన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ ఫోన్‌లు పోయినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టారని తెలిపారు.

సాంకేతిక పద్ధతుల వినియోగంతో గుర్తింపు

బాధితులు ఇచ్చిన ఫోన్‌ల గుర్తింపు నంబర్లను సేకరించి, ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగించి వాటి స్థానాలను గుర్తించ గలిగారు. ఈ ప్రక్రియలో మొత్తం 30 మొబైల్ ఫోన్‌లను వివిధ ప్రాంతాల్లో కనుగొని స్వాధీనం చేసుకున్నారు.

బాధితులకు ఫోన్లను తిరిగి అందజేత

స్వాధీనం చేసిన ఫోన్లను ఈ రోజు బాధితులకు తిరిగి అందజేశారు. వీటి అంచనా విలువ సుమారు ఐదు లక్షల రూపాయలుగా ఉంది. ఇప్పటి వరకు పాపన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 381 మొబైల్ ఫోన్లను పోలీసులు గుర్తించి యజమానులకు అందజేశారని అదనపు ఎస్పీ తెలిపారు.

ప్రజలకు సూచనలు

ప్రజలు తమ మొబైల్ ఫోన్ల గుర్తింపు నంబర్లను సురక్షితంగా భద్రపరచుకోవాలని, ఫోన్ పోయిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని అదనపు ఎస్పీ మహేందర్ సూచించారు.

కృషి చేసిన పోలీసు సిబ్బందికి ప్రశంసలు

ఈ మొబైల్ రికవరీలో కీలక పాత్ర పోషించిన సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్, కానిస్టేబుల్ నానుసింగ్ (పీసీ–807) ని అదనపు ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వారి అంకితభావం, కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు.అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర పోలీసు సిబ్బందిని కూడా ఆయన ప్రశంసించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments