Wednesday, October 15, 2025
Homeసినిమాసాయితేజ్ పాన్ ఇండియా సినిమా.. గ్లింప్స్ రిలీజ్

సాయితేజ్ పాన్ ఇండియా సినిమా.. గ్లింప్స్ రిలీజ్

Sambarala Yeti Gattu Movie Glimpse

మెగాహీరో సాయితేజ్ నుంచి గత రెండేళ్లుగా ఎలాంటి సినిమా రాలేదు. 2023లో ‘విరూపాక్ష’తో సక్సెస్ అందుకున్నప్పటికీ.. పవన్‌తో కలిసి నటించిన ‘బ్రో’ ఫ్లాప్ అయింది. మళ్లీ ఇన్నాళ్లకు ‘సంబరాల ఏటిగట్టు’ అనే మూవీతో రాబోతున్నాడు. సాయితేజ్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. గ్లింప్స్ బట్టి చూస్తే మాస్ యాక్షన్ మూవీ అని క్లారిటీ వచ్చింది. అయితే విజువల్స్ అన్నీ ‘కేజీఎఫ్’లో నరాచీని గుర్తుచేసేలా కనిపించాయి. సాయితేజ్ బాడీ బిల్డింగ్ అంతా బాగానే ఉంది. గ్లింప్స్‌లోనూ కథ ఎలా ఉండబోతుందనే రివీల్ చేశారు. లెక్క ప్రకారం గత నెలలోనే సినిమా రిలీజ్ చేస్తామని చాన్నాళ్ల క్రితం ప్రకటించారు. కానీ షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా గ్లింప్స్‌లో మూవీ రిలీజ్ డేట్ వేయలేదు. మరి ఈ ఏడాది తీసుకొస్తారా లేదంటే వచ్చే ఏడాది థియేటర్లలోకి మూవీ వస్తుందా అనేది చూడాలి?

Previous article
RELATED ARTICLES

Most Popular

Hello world!

Recent Comments